శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2019 (13:32 IST)

ముంబైకు నడిపే విమానాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకు?

భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై - అమెరికాల మధ్య నడిచే విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఈ మేరకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ సర్వీసెస్ అత్యవసర ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ తరహా ఆదేశాలు జారీచేయడానికి కారణాలు లేకపోలేదు.
 
గత కొన్ని రోజులుగా అమెరికా - ఇరాన్‌ల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా ట్రేడ్‌వార్ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికాకు చెందిన డ్రోన్ ఒకటి తమ భూభాగంలోకి ప్రవేశించిందని ఇరాన్ పేర్కొని, ఆ డ్రోన్‌ను కూల్చివేసింది. దీంతో అమెరికా - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త ఆదేశాలు నెలకొన్నాయి. 
 
ఈ కారణంగా ఇరాన్ గగనతలం మీదుగా అమెరికా విమానాలు వెళ్లొద్దని ఫెడరల్ ఏవియేషన్ విభాగం ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా ముంబై - అమెరికాల మధ్య నడిచే విమానాలను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధికారులు వెల్లడించారు. 
 
పైగా, ప్రయాణికులు ప్రత్యామ్యాయ చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌తో పాటు అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్‌లు ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించే అన్ని విమాన సర్వీసులను రద్దు చేశాయి.