ఖతార్‌తో అమెరికా భారీ డీల్: ఆయుధాల కోసం 12బిలియన్ల రక్షణ ఒప్పందం
అమెరికా ఇతర దేశాల గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. తన ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తోంది. ఉగ్రవాదంపై మూకుమ్మడిగా పోరాడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపు నిచ్చిన నేపథ్యంలో.. అమెరికా 12 బిలియన్ డ
అమెరికా ఇతర దేశాల గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. తన ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తోంది. ఉగ్రవాదంపై మూకుమ్మడిగా పోరాడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపు నిచ్చిన నేపథ్యంలో.. అమెరికా 12 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాన్ని ఖతార్‌తో కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 36 ఎఫ్-15 జెట్ విమానాలను ఖతార్‌కు అమెరికా సరఫరా చేయనున్నట్లు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ తెలిపింది.
అయితే ఈ ఒప్పందం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదంపై మూకుమ్మడి పోరాటం నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన పిలుపుతో ఖతార్‌తో సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఈజిప్ట్, యూఏఈలు సంబంధాలను తెంచుకున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా ఈ దేశాలు దౌత్య సంబంధాలు తెంచుకోవడంతో పాటు.. ఖతార్ వెళ్లే రవాణా వ్యవస్థను సైతం నిలిపివేశాయి. కానీ ఖతార్‌తో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందంతో సౌదీతో పాటు ఇతర దేశాలు ఫైర్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా, ఖతార్‌ల మధ్య సైనిక సహకార చర్యల ద్వారా ఉగ్రవాదంపై పోరుకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. అమెరికా ప్రతినిధి జిమ్ మాటిస్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా విధ్వంసానికి అడ్డుకట్ట వేసి శాంతిని నెలకొల్పవచ్చునని మాటిస్ వెల్లడించారు.