గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (08:45 IST)

నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా రిజిస్ట్రేషన్ ఫీజు 2050 శాతం పెంచేసిన అమెరికా

visa
నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా రిజిస్ట్రేషన్ ఫీజును అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారి భారీగా పెంచేసింది. హెచ్1బీ, ఎల్1, ఈబీ5, ఈబీ6, హెచ్1బీ రిజిస్ట్రేషన్ వంటి పలు రకాలైన వీసా దరకాస్తుల ఫీజులను అమాంతం రెట్టింపు చేసింది. ఈ పెంచిన కొత్త ఫీజు ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ప్రస్తుతం హెచ్1బి వీసా దరఖాస్తు ఫీజు రూ.38,160గా ఉంటే దీన్ని రూ.64,706కి పెంచేసింది. అలాగే హెచ్1బీ రిజిస్ట్రేషన్ వీసా ధరను రూ.829గా ఉంటే కొత్త ధర రూ.17,835గాను, ఎల్1 వీసా ధరను రూ.38,160 నుంచి రూ.1,14,887గాను, ఈబీ6 వీసాను 3,04,845 నుంచి రూ.9,25,718గా పెంచేసింది. ఈ పెంచు ఏకంగా 2050 శాతంగా ఉంది. దీనిపై నెటిజన్లతో పాటు టెక్కీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
కాగా, హెచ్1బీ వీసాను ఇతర దేసాల వృత్తి నిపుణులకు అమెరికాలో ప్రవేశం కోసం జారీచేసే వీసా. ఎల్1 వీసా.. వివిధ దేశాల్లో బ్రాంచిలు ఉన్న అమెరికాల కంపెనీలు ఆయా బ్రాంచిల నుంచి అమెరికాలో పనిచేసేందుకు ఉద్యోగులను రప్పిస్తుంటారు. ఈ అంతర్గత బదిలీలపై వచ్చే వారికి ఈ తరహా వీసాలను మంజూరు చేస్తారు. ఈబీ5 వీసాను అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే వీసా, రూ.4 కోట్లు అంతకుముంచి పెట్టుబడి పెట్టగలిగివుండి కనీసం పది మందికి ఉపాధి కల్పించగల పెట్టుబడిదారులకు, వారి కుటుంబ సభ్యులకు ఈబీ5 వీసాలను కేటాయిస్తారు. l