శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (12:51 IST)

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్విట్టర్ రివ్యూ.. ఫుల్ ఫన్.. సంపూ సినిమాలా..?

Extra Ordinary Man
నితిన్ హీరోగా నటిస్తున్న 32వ చిత్రం "ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్". వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. శ్రీలీల కథానాయికగా నటించింది. 
 
ప్రేక్షకులను నవ్వించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించామని ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూల్లో నితిన్ చెప్పాడు. ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియా వేదికపై నెటిజన్లు ఏమనుకుంటున్నారో చూద్దాం. 
 
ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. ఆ పాత్రకు ఆయన సరిగ్గా సూట్ అయ్యారని, కామెడీ టైమింగ్ బాగుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ ఫుల్‌ ఫన్‌ మూవీ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. లవ్ ట్రాక్ క్యూట్‌గా ఉంది.
 
ఈ సినిమా ద్వారా నితిన్ కొత్త పాత్రలో కనిపించి పాపులర్ అయ్యాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రతి ఒక్కరికీ సినిమా నచ్చుతుందని అంటున్నారు. రాజశేఖర్ పాత్ర చిన్నదే అయినప్పటికీ ఆయన కనిపించిన సన్నివేశాలన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. 
 
ఈ సినిమాకు రావు రమేష్ పాత్ర ప్రధాన బలం. సెకండాఫ్ అంతా సరదాగా సాగుతుంది. అయితే మరికొంతమంది మాత్రం కథలో కొత్తదనం లేదని, పాతబడిపోయి డిజాస్టర్‌ అయిందని వాపోతున్నారు. ఇది సంపూర్ణేష్ బాబు సినిమాలా ఉందని, అన్ని సినిమాలకు స్పూఫ్‌లా ఉందని కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.