శ్రీలంకలో తీరానికి కొట్టుకొస్తున్న తిమింగలాలు
శ్రీలంకలో కొలంబోకు దక్షిణాన పనాదుర వద్ద బీచ్ కు తిమింగలాలు కొట్టుకొస్తున్నాయి. సముద్రంలోకి ఉపుల్ రంజిత్ అనే మత్స్యకారుడి చేపలు పట్టి ఒడ్డుకు వచ్చేటప్పుడు సుమారు వంద తిమింగలాల దాకా ఇసుకపై పడి ఉన్నాయట.
వాటిని చూసి ఒక్కసారిగా భయానికి, ఆశ్చర్యానికి గురయ్యారని, ఇంతకుముందెప్పుడూ అటువంటిది చూడలేదని రంజిత్ చెబుతున్నారు. అయితే కొంతమంది పురుషులు, కోస్ట్‌గార్డ్, నావికాదళ అధికారులు కలిసి ఆ తిమింగలాలను బలవంతంగా సముద్రంలోకి నెట్టారు.
అలా చేస్తున్నప్పుడు గ్రామస్తులంతా గుమిగూడి ఆ దృశ్యాన్ని చూశారు. అలాగే ఈ సంవత్సరం సెప్టెంబరులో ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియా తీరంలో అనేక వందల తిమింగలాలు మరణించాయి. అసలిలా తిమింగలాలు సముద్రం వెలుపలికి రావడం, చనిపోవడం.. శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టడం లేదు.
తిమింగలాలు నివసించే సముద్రనీటిలో పెనుమార్పు సంభవించి ఉంటుందని, దాంతో తిమింగలాల జీవనానికే ప్రమాదం పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.