శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (10:01 IST)

కారును నేరుగా షాపింగ్ స్టోర్లోకి తీసుకెళ్లాడు.. సరుకులు కొన్నాడు.. బిల్లు చెల్లించి వెళ్లిపోయాడు.

షాపింగ్ మాల్‌కు వెళ్లాలంటే.. మనం స్కూటర్లోనూ, కారులోనో, బస్సులోనూ వెళ్తుంటాం. కారులో, స్కూటర్లో వెళ్తే పార్కింగ్ ఏరియాలో వాటిని విడిచి పెట్టి.. లోనికి వెళ్లి మనకి కావాల్సింది కొనుక్కుంటాం. అయితే ఓ వ్య

షాపింగ్ మాల్‌కు వెళ్లాలంటే.. మనం స్కూటర్లోనూ, కారులోనో, బస్సులోనూ వెళ్తుంటాం. కారులో, స్కూటర్లో వెళ్తే పార్కింగ్ ఏరియాలో వాటిని విడిచి పెట్టి.. లోనికి వెళ్లి మనకి కావాల్సింది కొనుక్కుంటాం. అయితే ఓ వ్య‌క్తి త‌న కారుని షాపింగ్‌ స్టోర్‌లోప‌లికి తీసుకెళ్లిన ఘ‌ట‌న చైనాలో చోటు చేసుకుంది. ఆ షాపింగ్ మాల్‌కి కారు పార్కింగ్ స్థ‌లం ఉంది. అయితే, కారుని పార్క్ చేసి.. మాల్‌లోకి వెళ్లి సరుకులు తీసుకుని.. మళ్లీ పార్కింగ్ స్థలంలోకి వెళ్ళి కారును తీసుకునే సమయంలో వృధా అవుతుందని భావించిన ఆ వ్యక్తి ఏకంగా కారుతోనే  లోపలికి వెళ్లాడు. 
 
వివ‌రాల్లోకి వెళితే, తూర్పు చైనాలో జెన్‌జియాంగ్‌లో ఓ వ్యక్తి స్టోర్‌లోకి నేరుగా కారుని తీసుకెళ్లాడు. అంద‌రూ చూస్తుండ‌గానే తనకు కావాల్సిన స‌రుకుల‌ని కొనుక్కున్నాడు. అంద‌రూ ఆశ్చ‌ర్యంతో అత‌డినే చూస్తుండ‌గానే తాను కొనుక్కున్న వ‌స్తువుల‌కి బిల్లు చెల్లించాడు. ఆపై ఆ కారును షాపు నుంచి వెనక్కి తీసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆ మాల్‌లోని సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.