అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి మహిళ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళ ఒకరు పోటీ చేయనున్నారు. ఆమె పేరు కమలా హ్యరిస్. ఈమె ప్రస్తుతం సెనెటర్‌గా ఉంది. సెనెట్‌కు ఎంపికైన మొదటి భారతీయ అమెరికన్ అయిన కమలా హ్యరిస్‌ను అమెరికాలో ఫిమెల్ ఒబామాగా పేర్కొంటారు. అయితే కొద్దిరోజులక్రితం ఆమె అయోవాలో పర్యటించడంతో ఈ వాదనకు బలం చేకూరింది.
2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా, మొదటి ప్రైమరీ అయోవాలోనే జరుగనుంది. డెమొక్రటిక్ పార్టీ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ట్రంప్‌కు ధీటుగా ఎదిగినట్లు స్థానిక మీడియా వార్తా కథనాలను వెల్లడించింది. అయితే ఈ వార్తలను ఆమె ఖండించకపోవడం గమనార్హం.