శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 9 మార్చి 2019 (18:30 IST)

మేక మేయరయ్యిందంటే.. నమ్ముతారా..? నమ్మి తీరాల్సిందే?!

మేక మేయరయ్యిందంటే.. నమ్ముతారా.. నమ్మి తీరాల్సిందే. అమెరికాలోని ఓ చిన్న పట్టణంలో ఈ విచిత్రం జరిగింది. ప్రజలు మేకను మేయర్‌గా ఎన్నుకుని దానికి బాధ్యతలు అప్పగించారు. అమెరికా చరిత్రలో గుర్తింపు తెచ్చుకున్న మాజీ అధ్యక్షుడు అబ్రహాంలింకన్‌ పేరును ఈ మేకకు పెట్టారు. ఈ ఎన్నికల్లో మేక మేయర్‌గా ఎన్నికకాగా.. శునకాలు, పిల్లులు సహా 15 ఇతర జంతువులు పాలకవర్గ సభ్యులుగా విజయం సాధించాయి. 
 
వివరాల్లోకి వెళితే.. తమ పట్టణంలోని మైదానం నిర్మాణానికి నిధులు సేకరించేందుకు ఈ ఎన్నికలు నిర్వహించామని ఫెయిర్‌హావెన్‌ అధికారి జోసెఫ్‌ గుంటెర్‌ తెలిపారు. ఇందులో భాగంగా కొన్ని పట్టణాల్లో మేయర్‌గా పిల్లి సేవలందిస్తుందని పత్రికలో చదివిన తర్వాత తనకు ఈ వినూత్న ఆలోచన తట్టిందని చెప్పారు. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యానికి ఓ తార్కాణంగా జోసెఫ్‌ అభివర్ణించారు. 
 
కాగా మేయర్‌గా లింకన్‌ సమ్మీ అనే శునకంపై 13 ఓట్ల తేడాతో విజయం సాధించింది. 2500 మంది జనాభా కలిగిన ఈ పట్టణంలో మేయర్‌గా లింకన్‌ ఏడాది పాటు సేవలందించనుంది.