సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (21:33 IST)

మధుమేహానికి చెంపదెబ్బ ట్రీట్మెంట్.. ఓ మహిళ మృతి.. ఎక్కడ?

slap
మధుమేహానికి అనేక రకాల మందులు ఉన్నాయి. యోగాతో వాటిని నియంత్రించవచ్చని కూడా చెప్తారు. కానీ చెంపదెబ్బతో మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునట. ఇదేం ట్రీట్మెంట్ అనేదే కదా మీ డౌట్. అయితే ఈ కథనం చదవండి. ఇది మూఢనమ్మకం కాదు. దీని వెనుక వైద్య శాస్త్రం ఉంది. దీనినే స్లాపింగ్ థెరపీ అంటారు. 
 
ఈ థెరపీలో భాగంగా రోగులకు చెంపదెబ్బ కొట్టి చికిత్స అందిస్తారు. దీని వర్క్‌షాప్‌లు చైనా, కొరియాతో సహా అనేక దేశాలలో జరుగుతాయి. ఇదేవిధంగా విల్ట్‌షైర్‌లోని క్లీవ్ హౌస్‌లోని పైడా లాజిన్ థెరపీ వర్క్‌షాప్‌లో చికిత్స పొందుతూ డేనియల్ కార్-కామ్ అనే మహిళ అక్టోబర్ 20, 2014న మరణించింది. 
 
కాలిఫోర్నియాలోని క్లౌడ్‌బ్రేక్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిని గురువారం (నవంబర్ 30) ఆస్ట్రేలియా నుండి వారెంట్‌పై UKకి తీసుకువచ్చిన తర్వాత అరెస్టు చేశారు. శుక్రవారం (డిసెంబర్ 1) సాలిస్‌బరీ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆ వ్యక్తి ప్రజలకు వైద్య సలహాలు అందిస్తున్నాడని... కానీ బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ ద్వారా అర్హత పొందలేదని అధికారులు తెలిపారు.
 
 నిజానికి, ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్‌లో నివసిస్తున్న 71 ఏళ్ల డేనియల్ కార్-గోమ్మ్‌కు మధుమేహం ఉంది. చాలా చోట్ల చికిత్స చేసినా ఆమె కోలుకోకపోవడంతో ఎవరైనా స్లాపింగ్ థెరపీ వర్క్‌షాప్‌కు వెళ్లమని సలహా ఇచ్చారు. ఇంగ్లండ్‌లోని ప్రజలకు ఇది సాధారణ విషయం. ఇందులో రోగులను పదే పదే చెంపదెబ్బ కొట్టి వైద్యం చేస్తున్నారు.
 
అయితే ఈ చికిత్సలో భాగంగా పలుమార్లు చెంపపై కొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఫలితంగా, శిక్షకుడు హాంగ్చి జియావోపై హత్య ఆరోపణలు వచ్చాయి. చెంప దెబ్బ చప్పుడు చేయడం వల్ల రక్తనాళాలు పగిలి రక్తంలోని విషపదార్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయని దీని వెనుక ఉన్న నమ్మకం.

మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయని.. వైద్యం ద్వారా కూడా నయం చేయలేని అనేక వ్యాధులను ఈ చికిత్సతో నయం చేయవచ్చని చెబుతున్నారు.