గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 13 డిశెంబరు 2020 (08:43 IST)

అద్భుత కారు.. దీని గురించి తెలిస్తే హుషారు

ఇది ఓ సోలార్‌ కారు.. గంటకు 110 మైళ్ల వేగంతో దూసుకెళ్తుంది. అలాగని చార్జింగ్‌ పెడుతూనే ఉండాల్సిన అవసరమే లేదు.. కారుకు అమర్చిన సోలార్‌ పానెళ్లతోనే చార్జవుతూ ముందుకు వెళుతుంది.

ఈ అద్భుతమైన కారు మోడల్‌ను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అప్టెరా ఎలక్ట్రిక్‌ కంపెనీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తీసుకొస్తోంది. రాత్రి వేళల్లో వెయ్యి మైళ్ల వరకు సునాయాసంగా తీసుకెళ్లే బ్యాటరీతో ఇది ముస్తాబయింది.

దీనికీ ప్రత్యేకంగా చార్జింగ్‌ చేయాల్సిన అవసరమే లేదు. సోలార్‌ ప్యానెళ్ల సహకారంతో కారు నడుస్తున్నప్పుడే ఈ బ్యాటరీ చార్జవుతుంది. సోలార్‌ కార్ల రంగంలో ప్రసిద్ధి గాంచిన టెల్సా కంపెనీ మోడల్‌ కార్ల స్పేర్‌ బ్యాటరీతో 370 మైళ్లు మాత్రమే నడిచే అవకాశం ఉంది.

దీనిపై కంపెనీ యాజమాన్యం మాట్లాడుతూ తమ మోడల్‌ కారు వెయ్యి మైళ్ల వరకు బ్యాటరీ సహాయంతో దూసుకెళ్తుందన్నారు. వెయ్యి మైళ్లు నడిచిన తర్వాత బ్యాటరీ చార్జింగ్‌ పూర్తిగా అయిపోతే లేదా ఐదారు రోజుల వరకు కారును బయటకు తీయకపోతే బ్యాటరీని చార్జి చేసుకోవాల్సిన అవసరం పడుతుందన్నారు.

రోజు నడిపే వారు ఎన్నడూ బ్యాటరీని చార్జి చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ కారు ఖరీదు దాదాపు రూ.19 లక్షలు. ఖరీదైన మోడళ్లు రూ.35లక్షలు వరకూ ఉన్నాయి. డిసెంబర్‌ 4వ తేదీ నుండి ప్రీ లాంచింగ్‌ బుకింగ్‌ ప్రారంభమైంది. ఇప్పటికే పలు కార్లు కూడా బుక్కయ్యాయని కంపెనీ యాజమాన్యం తెలిపింది.