శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : మంగళవారం, 22 మే 2018 (18:29 IST)

ఐపీఎల్ 2018 క్రష్ : స్టేడియంలో హల్‌చల్ చేస్తున్న ఆ యువతి ఎవరు?

ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ పొందిన క్రీడగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పోటీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్వదేశంలో పదకొండో అంచె పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఐపీఎల్‌లోని పలు ఫ్రాంచైజీలకు సినీ సెలెబ్ర

ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ పొందిన క్రీడగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పోటీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్వదేశంలో పదకొండో అంచె పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఐపీఎల్‌లోని పలు ఫ్రాంచైజీలకు సినీ సెలెబ్రిటీలతో పాటు.. బడా పారిశ్రామికవేత్తలు యజమానులుగా ఉన్నారు. మొత్తం పది జట్లు ఉండగా, అలాంటి వాటిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. ఈ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం వహిస్తున్నాడు.
 
ఈ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో చెన్నై సూపర్ కింగ్స్‌లో ప్రధాన బౌలర్‌గా దీపక్ చాహర్ సోదరి మల్తి చాహర్ ఒకరు. ఈమె ఆమాంతం చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు... ధోనీ వీరాభిమానిగా మారిపోయింది. ఈమె సీఎస్కే మ్యాచ్‌లకు క్రమం తప్పకుండా హాజరవుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.