సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (20:18 IST)

ఐపీఎల్ 2021: బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, డేవిడ్ మలన్ అవుట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచులు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్‌, షార్జా, అబుదాబిలో కఠిన బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ 2021 మ్యాచులు జరగనున్నాయి. సెప్టెంబరు 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
 
అయితే ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టుకు భారీ షాక్ తగిలింది. ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచులకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది.
 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ఐపీఎల్ 2021 రెండో దశ నుంచి వైదొలిగినట్లు సమాచారం తెలుస్తోంది. బెయిర్‌స్టో ఐపీఎల్ 2021 రెండో దేశ మ్యాచులకు అందుబాటులో ఉండడని ఈవినింగ్ స్టాండర్డ్ యూకే తమ నివేదికలో పేర్కొంది. 
 
బెయిర్‌స్టోతో పాటు పంజాబ్ కింగ్స్ హిట్టర్ డేవిడ్ మలన్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆల్‌రౌండర్‌ క్రిస్ వోక్స్ కూడా ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్నారట. ఈ ముగ్గురు టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీసులో ఆడిన విషయం తెలిసిందే. వేరు తప్పుకోవడానికి కరోనా అనే తెలుస్తోంది. టెస్ట్ సిరీస్ ఆడిన ఇంగ్లండ్ ప్లేయర్స్ వరుసగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నారు.