బుధవారం, 26 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 మార్చి 2025 (20:01 IST)

Virat Kohli Dance: షారుక్ ఖాన్‌తో కలిసి "ఝూమే జో పఠాన్" పాటకు స్టెప్పులేసిన కింగ్ కోహ్లీ (video)

Sharukh_Kohli
Sharukh_Kohli
ఐపీఎల్ 2025 సీజన్‌ ఘనంగా ప్రారంభమైంది. ఈ ఆరంభ వేడుకల‌ను బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రారంభించగా.. ప్రఖ్యాత సింగర్ శ్రేయా ఘోషల్ తన మధురమైన పాటలతో అలరించారు. రూఖ్ ఖాన్ ఈ వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని స్టేజీపైకి ఆహ్వానించాడు. 
 
18 సీజన్లుగా ఆడుతూ అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాడిగా అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీతో సరదాగా మాట్లాడిన షారూఖ్ ఖాన్.. అనంతరం కేకేఆర్ సెన్సేషన్ రింకూ సింగ్‌ను కూడా స్టేజీపైకి ఆహ్వానించాడు. రింకూ సింగ్‌తో కలిసి షారూఖ్ ఖాన్ డ్యాన్స్ చేయగా.. విరాట్ కోహ్లీ పడి పడి నవ్వుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ కూడా షారూఖ్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. 
 
ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుకల్లో విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్‌తో కలిసి "ఝూమే జో పఠాన్" పాటకు అదిరిపోయే డాన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. కాగా ఈ ప్రారంభ వేడుకల్లో ప్రఖ్యాత సింగర్ శ్రేయా ఘోషల్ తన మధురమైన పాటలతో అలరించారు. ఆమి ఝే తోమర్ పాటతో మొదలు పెట్టిన శ్రేయా.. మా తుఝే సలాం సాంగ్‌తో తన ప్రదర్శనను ముగించారు.