బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 మే 2022 (17:18 IST)

2023లోనూ పసుపు జెర్సీలోనే చూస్తారు.. ధోనీ కామెంట్స్

dhoni - csk
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్‌కు దూరం కాబోతున్నాడనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.  
 
ఈ నేపథ్యంలో, సన్ రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోనీ తన భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చాడు. వచ్చే సీజన్‌లో కూడా ఆడతానని, 2023లోనూ తనను చెన్నై సూపర్ కింగ్స్ పసుపు జెర్సీలోనే చూస్తారని వెల్లడించాడు. 
 
టోర్నీలో ప్రస్తుతం చెన్నై జట్టు ఆడుతున్న తీరును సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు. అనేక క్యాచ్‌లు వదిలేశామని, ఫీల్డింగ్ మెరుగుపర్చుకోవడం అత్యావశ్యకం అని ధోనీ స్పష్టం చేశాడు. 
 
అంతేకాదు, బ్యాటింగ్, బౌలింగ్ అంశాల్లో కూడా ఉదాసీనంగా ఆడితే కష్టమని సహచరులకు హెచ్చరిక చేశాడు.