శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 జులై 2017 (12:32 IST)

కేఎఫ్‌సీ నుంచి చికెన్ కాదు.. స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..

కేఎఫ్‌సీలో చికెన్ వెరైటీలను టేస్ట్ చేసి వుంటాం. అయితే కేఎఫ్‌సీ ఇక చికెన్ వెరైటీలతో పాటు స్మార్ట్ ఫోన్‌ వచ్చేసింది. కేఎఫ్‌సీ, చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ హువేయి కలిపి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో

కేఎఫ్‌సీలో చికెన్ వెరైటీలను టేస్ట్ చేసి వుంటాం. అయితే కేఎఫ్‌సీ ఇక చికెన్ వెరైటీలతో పాటు స్మార్ట్ ఫోన్‌ వచ్చేసింది. కేఎఫ్‌సీ, చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ హువేయి కలిపి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేశాయి. చైనాలో కేఎఫ్‌సీని ప్రారంభించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఫోన్‌ను విడుదల చేశారు. కేఎఫ్‌సీ హువేయి 7 ప్లస్ పేరుతో పరిమిత సంఖ్యలో ఈ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు సంస్థ ప్రకటించింది. 
 
ఇందులో కేఎఫ్‌సీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేశారు. అలాగే కె-మ్యూజిక్ యాప్‌ కూడా ఉంది. అమెజాన్‌లాగా చైనాలోని ఈ-కామర్స్ దిగ్గజం టిమాల్‌లో గురువారం నుంచి ఈ ఫోను అందుబాటులో వచ్చింది. ఈ ఫోన్ ధర.. భారత కరెన్సీలో పోల్చితే రూ.10వేలు. రెడ్ కేసింగ్‌తో ఆకట్టుకునే ఈ ఫోనులో 32 జీబీ అంతర్గత మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది.