శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (19:36 IST)

జియో బాటలో ఎయిర్ టెల్.. రూ.179 ప్లాన్‌లో వున్న తేడా ఏంటి?

jioservice
జియో బాటలోనే ప్రస్తుతం ఎయిర్ టెల్ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని.. రూ.179కి డబుల్ డేటాను అందిస్తుంది. భారతదేశంలో ప్రధానంగా జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ వంటి మూడు టెలికాం కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. 
 
ఈ ముగ్గురు టెలికాం ఆపరేటర్లు తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ప్లాన్‌లను తెస్తూనే ఉన్నారు. ఈ కంపెనీలన్నీ తమ కస్టమర్లకు నెలవారీ, మూడు నెలలు, 1 సంవత్సరం కూడా ప్లాన్‌లను అందిస్తాయి.
 
జియో రూ.179 ప్లాన్
జియో రూ. 179 ప్లాన్ ద్వారా 24 రోజుల వాలిడిటీని పొందుతారు. ఇది కాకుండా, 1GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లతో రోజుకు 100 SMSల సౌకర్యాన్ని అందిస్తుంది. అదే సమయంలో, జియో ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది.
 
ఎయిర్‌టెల్ రూ. 179 ప్లాన్
ఎయిర్‌టెల్ కూడా జియో మాదిరిగానే రూ. 179 ప్లాన్‌ను అందజేస్తుంది. ఈ ప్లాన్‌తో రోజుకు 2GB డేటా, 300SMS, 28 రోజుల వాలిడిటీని పొందుతారు. దీనితో పాటు, మీరు ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని పొందుతారు.
 
ఈ ప్లాన్స్ మధ్య తేడా ఏంటి?
ఎయిర్‌టెల్ ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఇది Jio ప్లాన్ కంటే రెట్టింపు, ఎందుకంటే Jio  ప్లాన్ 1GB డేటాను అందిస్తుంది. జియో ప్లాన్ వాలిడిటీ 24 రోజులు అయితే ఎయిర్‌టెల్ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.