AI Job Threat లక్షల్లో ఉద్యోగుల పొట్ట కొట్టనున్న ఏఐ: ఒబామా, గేట్స్ ఆందోళన
AI(artificial intelligence) కృత్రిమ మేధ సాంకేతిక సౌకర్యం లక్షల్లో ఉద్యోగుల పొట్ట కొట్టనుంది. కీలక రంగాలైన విద్య, వైద్యంలోని ఉద్యోగులకు ఏఐ అతిపెద్ద ముప్పు (AI Job Threat)గా పరిణమించే అవకాశం వున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ గురించి బిల్ గేట్స్ మాట్లాడుతూ... ఏఐ ట్యూటరింగ్, వైద్య సలహాలు వంటి ఎన్నో సమస్యలను సుళువుగా పరిష్కరిస్తుంది. అంతేకాదు.. దీనిదెబ్బకు పని విధానాలు కూడా మారిపోనున్నాయి. వారానికి మూడు లేదా రెండ్రోజులు పనిచేసినా సరిపోతుందేమో అంటూ అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఇప్పటికే ఏఐ దెబ్బకు ఉన్నది లేనట్లు లేనిది వున్నట్లుగా కూడా చూపించడం వంటి కొన్ని సవాళ్లు కూడా మన ముందు కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు పక్కన బెడితే, ఉన్నతస్థాయి మేధోపరమైన ఎన్నో పనులను ఏఐ సమర్థవంతంగా పనిచేయడంతో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగులకు ఇది సవాలుగా నిలువనుంది.
సిలికాన్ వ్యాలీలో లక్షల్లో జీతాలు పొందుతున్న ఉద్యోగాలు కూడా ఊడిపోయే ప్రమాదాన్ని సమీప భవిష్యత్తులో ఏఐ సృష్టించే అవకాశం లేకపోలేదంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ఏఐ పోటీని తట్టుకుని ఉద్యోగాన్ని సంపాదించడం ఎలా, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆదాయం ఎలా పొందాలి అని ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు అని అభిప్రాయపడ్డారు.