గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (12:06 IST)

ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఫీచర్లేంటి...

ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ కొత్త అప్‌డేట్‌ వెర్షన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌ పేరుతో వచ్చిన ఈ కొత్త వెర్షన్‌ గూగుల్‌ స్మార్ట్‌ఫోన్స్‌ అయిన నెక్సస్‌ సిరీస్‌లతో పాటు త్వరలో మార్కెట్

ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ కొత్త అప్‌డేట్‌ వెర్షన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌ పేరుతో వచ్చిన ఈ కొత్త వెర్షన్‌ గూగుల్‌ స్మార్ట్‌ఫోన్స్‌ అయిన నెక్సస్‌ సిరీస్‌లతో పాటు త్వరలో మార్కెట్లోకి రానున్న ఎల్‌జీ వి20 లాంటి నాన్‌ గూగుల్‌ ఫోన్‌లోనూ అప్‌డేట్‌ కానుంది. ఇంతకీ ఆండ్రాయిడ్‌ కొత్త ఓఎస్‌ 7.0 లో న్యూ ఫీచర్స్‌ ఏంటో పరిశీలిద్ధాం. 
 
సాధారణంగా మనం వాడే స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌కు న్యూ టెంప్లెట్‌ ఉంటుంది. అందులో వాట్సప్‌ నోటిఫికేషన్‌, ఫేస్‌బుక్‌ లైక్‌, ట్వీటో కనిపిస్తే.. ఆ టెంప్లెట్‌ను ఓపెన్‌ చేసి ఎంచక్కా అక్కడి నుంచే డైరెక్ట్‌గా స్పందించవచ్చు. అంటే డైరెక్ట్‌ రిప్లై అనమాట.
 
ఐకాన్స్‌ సెట్టింగ్స్‌ విషయంలో మరింత వెసులుబాటు ఉంది. ఒకే స్వైప్‌తో ఫ్లాష్‌లైట్‌, వైఫై, బ్లూటూత్ లాంటివే కాకుండా మనకు నిత్యం ఉపయోగపడే ఐకాన్స్‌ మనకి ఇష్టం వచ్చిన ఆర్డర్‌లో సెట్‌ చేసుకునే వీలుంది.
 
ఈ ఆండ్రాయిడ్‌ కొత్తవెర్షన్‌లో మల్టీ విండో ప్రధాన ఆకర్షణ. కంప్యూటర్ డెస్క్‌టాప్‌ల తరహాలో ఒకటి కంటే ఎక్కువ విండోలను ఓపెన్‌ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒకేసారి రెండు యాప్స్‌ను ఓపెన్‌ చేసి పక్క పక్కన ఉంచి చూసుకునే అవకాశం కల్పించారు.
 
గతంలో బ్యాటరీ లైఫ్‌ను డోచ్‌ అనే ఫీచర్‌ను మార్స్‌మాలో వెర్షన్‌లో పరిచయం చేశారు. తాజా ఆండ్రాయిడ్‌ 7.0 లో ఇది మరోసారి అప్‌డేట్‌ అయింది. అనవసరమైన యాప్స్‌తో చార్జింగ్‌ ఖర్చుకాకుండా ఈ ఓఎస్‌ చూసుకుంటుంది. బ్యాటరీలైఫ్‌ను పెంచుతుంది. ఇలాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.