శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (16:29 IST)

5జీ స్పెక్ట్రమ్‌కు ముహూర్తం ఫిక్స్.. మార్చి నాటికి వేలం

5జీ స్పెక్ట్రమ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మార్చిలో 5జీ స్ప్రెక్ట్రమ్ వేలం వేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. వాటిలో స్ప్రెక్ట్రమ్ వేలం కూడా ఒకటి. 5జీ స్ప్రెక్ట్రమ్ కొనుగోలు చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులను ఈ నెలలోనే పిలుస్తారు. మార్చి నాటికి వేలం ప్రక్రియను పూర్తి చేస్తారు. 
 
మొత్తం మూడు రకాలైన స్ప్రెక్ట్రమ్‌ను వేలం వేయనున్నారు. అలాగే, టెలీకమ్యూనికేషన్ సెక్టార్‌లో నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ఏర్పాటు చేయాలని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల కోసం నమ్మకమైన, సర్వీసుదారులను, ఉత్పత్తుల జాబితాను కేంద్రం ప్రకటించనుంది.
 
ఇందులో భాగంగా 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz , 2500 MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌లో మొత్తం 20 సంవత్సరాలకు స్ప్రెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. మొత్తం 2251.25 MHz వేలం వేయనున్నట్టు చెప్పారు. దీని ద్వారా రూ. 3,92,332.70 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.