1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 జూన్ 2016 (13:18 IST)

హ్యాకర్లు సులువుగా పసిగట్టే 'ఏటీఎం పిన్ నంబర్లు' ఏవి.. వాటిలో కొన్ని ఇవే!

మారుతున్న టెక్నాలజీతో పాటు.. హ్యాకర్లు కూడా తమ టెక్నాలజీని ఎప్పటికపుడు అప్‌డేట్ చేసుకుంటున్నారు.

మారుతున్న టెక్నాలజీతో పాటు.. హ్యాకర్లు కూడా తమ టెక్నాలజీని ఎప్పటికపుడు అప్‌డేట్ చేసుకుంటున్నారు. ఫలితంగా ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఎన్నో రకాలుగా, పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. 
 
తాజాగా ఏటీఎం పిన్ నంబర్లకు సంబంధించి డేటా జెనిటిక్స్ అనే అంతర్జాతీయ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో వెల్లడైన విషయం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ నివ్వెర పోవాల్సిందే. ఈ సర్వే ప్రకారం... 10 వేల రకాల నాలుగు అంకెల పిన్ నెంబర్లలో 11 శాతం పిన్ నెంబర్లను హ్యాకర్లు సలువుగా పసిగట్టేస్తున్నారట. 
 
ఈ సంస్థ 3.2 మిలియన్ పాస్‌వర్డ్‌లను విశ్లేషించింది. హ్యాకర్లు సులువుగా పసిగట్టగలిగే ఏటీఎం పిన్ నెంబర్లను కొన్ని సూచించారు. అలాంటి వాటిలో కొన్ని ఈ నంబర్లివే... 1111, 2222, 3333, 4444, 5555, 6666, 7777, 8888, 9999, 0000, 1234, 1212, 1004, 2000, 6969, 1122, 4321, 1010 తదితర నంబర్లు ఉన్నాయి.