శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 4 జూన్ 2017 (12:24 IST)

ఆన్‌లైన్ మోసాలకు బ్రేక్-టీనేజర్ల కోసం ఫేస్‌బుక్ నుంచి ''టాక్'' అనే సరికొత్త యాప్

ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్న యువత కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా పిల్లలపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉంటుంది. టీనేజర్లైన పిల్లలు ఎలాంటి వారితో స్నేహం చ

ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్న యువత కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా పిల్లలపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉంటుంది. టీనేజర్లైన పిల్లలు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించే వీలుంటుంది. ‘టాక్’ పేరుతో పిలిచే ఈ యాప్‌ కేవలం టీనేజర్లకు మాత్రమే పరిమితంగా ఉంటుంది. ఇందులోకి తెలియనివారు ప్రవేశించడం, స్నేహాలు చేయడం లాంటి వాటివి ఉండవు. 
 
పిల్లల తల్లిదండ్రులకు కూడా నియంత్రణ ఉంటుందని.. వారిపై నిత్యం ఓ కన్నేసి ఉంచేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దినట్టు సమాచారం. ఇది కేవలం 13 ఏళ్ల వయసు వారికేనని ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. లైంగిక వేధింపులకు, దోపిడీకి గురయ్యే యువతను రక్షించే ఉద్దేశంతో ఈ కొత్త మెసేజింగ్ అప్లికేషన్‌ను ఫేస్‌‌బుక్ ప్రారంభించింది. ఈ టాక్‌ యాప్‌ద్వారా పిల్లల సంభాషణలను మీరు పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపింది. దీంతో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న టీనేజర్ల తల్లిదండ్రులకు ఊరటనివ్వనుంది. తమ పిల్లల ఆన్‌లైన్‌ స్వేచ్ఛను పర్యవేక్షించడానికి ఈ యాప్ పూర్తిగా సహకరిస్తుందని ఫేస్‌బుక్ వెల్లడించింది.