శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (15:15 IST)

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 సిరీస్‌‌లో సరికొత్త ఫోన్.. ఆగస్టు 6 నుంచి..?

Samsung Galaxy Note 20
స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 సిరీస్‌లో సరికొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. శాంసంగ్‌.కామ్, ప్రముఖ రిటైల్ దుకాణాలలో గెలాక్సీ నోట్ 20 సిరీస్ ఫోన్ల ప్రీ-బుకింగ్ గురువారం ఆగస్టు 6 నుంచి ప్రారంభమైంది. 
 
గెలాక్సీ నోట్ 20ని ప్రీ-బుక్ చేసే వినియోగదారులకు రూ. 7వేల విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే, గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5జీ ప్రీ-బుకింగ్ చేసిన వారు రూ .10,000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. 
 
భారత్‌లో గెలాక్సీ నోట్ 20, గెలాక్సీ నోట్ 20 ఆల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రీ-బుకింగ్‌ ప్రారంభిస్తున్నట్లు శాంసంగ్‌ తెలిపింది. భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ధర రూ .77,999 కాగా, హై వేరియంట్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5జీ రూ .1,04,999గా ఉండనుంది. నోట్‌ 20, నోట్‌ 20 ఆల్ట్రా 5జీ కూడా ఎయిర్‌టెల్‌, జియో ఇసిమ్‌ను సపోర్ట్‌ చేస్తాయి.