శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 అక్టోబరు 2018 (10:54 IST)

వచ్చే 48 గంటల్లో ఇంటర్నెట్‌ సర్వీసులకు బ్రేక్.. ఎందుకు?

వచ్చే 48 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులకు అడ్డంకులు ఎదురుకానున్నాయి. ఈ సేవలు అందించేందుకు ఉపయోగించే అత్యంత కీలకమైన డొమైన్ సర్వర్లకు మెయింటనెన్స్ పనులు జరగనుండటంతో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోవచ్చని రష్యా టుడే వెల్లడించింది. ఈ మెయింటనెన్స్ పనుల్లో భాగంగా కొద్దిసేపు పూర్తిగా నెట్‌వర్క్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
 
ఇటీవలికాలంలో ప్రపంచ వ్యాప్తంగా సైబర్ దాడులు, నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో ఇంటర్నెట్ అడ్రెస్ బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్‌ఎస్)కు భద్రత కల్పించడంలో భాగంగా 'ది ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్' (ఐసీఏఎన్‌ఎన్) ఈ నిర్వహణా పనులను చేపట్టనుంది. ఇందులోభాగంగా, డీఎన్‌ఎస్‌కు రక్షణ కల్పించే క్రిప్టోగ్రాఫిక్ కీను మార్చనున్నారు.
 
డీఎన్‌ఎస్ స్థిరంగా, భద్రంగా ఉండాలంటే ఇంటర్నెట్ షట్‌డౌన్ తప్పనిసరి అని కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (సీఆర్‌ఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మార్పునకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సిద్ధంగా లేకపోతే వాళ్ల కస్టమర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని స్పష్టంచేసింది. దీంతో రానున్న 48 గంటల్లో ఆన్‌లైన్ లావాదేవీలు, ఇతర ఇంటర్నెట్ సర్వీసులకు ఇబ్బందులు తప్పవని సీఆర్‌ఏ తెలిపింది.