ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (19:40 IST)

3,500లకి పైగా లోన్‌ యాప్‌లపై వేటు వేసిన గూగుల్

మోసపూరిత రుణ యాప్‌లపై గూగుల్ కొరడా ఝళిపించింది. పాలసీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా 2022లో గూగుల్ భారతదేశంలోని ప్లే స్టోర్ నుంచి 3,500లకి పైగా లోన్ యాప్‌లను తీసివేసింది. 
 
రెండు బిలియన్ల విలువైన మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు నివేదించబడిన తర్వాత ఈ చర్య తీసుకుంటున్నట్లు గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇలాంటి లోన్ యాప్‌లను గుర్తించామని.. వాటిని ప్లే స్టోర్ నుంచి తీసేసినట్లు గూగుల్ తెలిపింది. 
 
అంతేకాకుండా, 2023లో మరింత గోప్యతను అవలంబించాలని యోచిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. కస్టమర్ల గోప్యతను మెరుగుపరిచేందుకు గూగుల్ కొన్ని ఆండ్రాయిడ్ పరికరాలతో ప్రైవసీ శాండ్‌బాక్స్.. బీటా వెర్షన్‌ను ప్రారంభించింది. 
 
ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. దీని వల్ల యూజర్ ప్రైవసీ భంగం కలగదని.. డిజిటల్ వ్యాపారాలకు కూడా దోహదపడుతుందని గూగుల్ చెప్తోంది.