శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (14:49 IST)

జియో సిమ్ కొనేముందు.. ఇవి తెలుసుకోండి

అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తామని సంచలన ప్రకటన చేస్తూ, రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన వేళ, ఆ సంస్థ సిమ్‌ల కోసం యువత ఎగబడుతోంది. ప్రతి రిలయన్స్ డిజిటల్ స్టోర్ ముందూ భారీ ఎత్తున క్యూలు కనిపిస్తు

అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తామని సంచలన ప్రకటన చేస్తూ, రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన వేళ, ఆ సంస్థ సిమ్‌ల కోసం యువత ఎగబడుతోంది. ప్రతి రిలయన్స్ డిజిటల్ స్టోర్ ముందూ భారీ ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. ఈ సంస్థ టెలికామ్ రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలింతకీ రిలయన్స్ జియో అందిస్తున్న సేవలేంటి? ఈ ఆఫర్ సిమ్‌ను ఎలా పొందాలి? మీకున్న సందేహాలకు ఈ కింది వివరాల్లో సమాధానం దొరుకుతుంది.
 
రిలయన్స్ జియో అనేది 4జీ సర్వీస్. కేవలం 4జీ హ్యాండ్‌సెట్స్‌కు మాత్రమే ఈ సిమ్ సపోర్ట్ చేస్తుంది. భారత్ ఎక్కడికి కాల్స్ చేసుకున్నా పూర్తి ఉచితమనీ, రోమింగ్ కూడా ఫ్రీ అని ముఖేష్ అంబానీ తెలిపారు.
 
రిలయన్స్ జియో సిమ్ కార్డ్ పూర్తి ఉచితంగా లభిస్తుంది. ఏ డీలర్‌కు సిమ్ కార్డ్ కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్టూడెంట్ అయితే, మీ కాలేజీ ఐడీతో రిలయన్స్ స్టోర్‌లో సంప్రదించండి. డిసెంబర్ 31 తర్వాత 50 రూపాయలకు లభించే 1జిబి మీకు 25 రూపాయలకే లభిస్తుంది.
 
2016 డిసెంబర్ 31 వరకూ జియో డేటా, వాయిస్ కాలింగ్ సేవలు పూర్తి ఉచితం. జియో సిమ్ కావాలంటే, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక ఐడీ కార్డ్ తీసుకెళ్లి దగ్గర్లోని రిలయన్స్ స్టోర్‌లో సంప్రదించండి.