గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జులై 2020 (20:26 IST)

హానర్-9 సిరీస్‌ నుంచి రెండు సరికొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్ కూడా..!

Honor 9A
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్-9 సిరీస్‌లో మరో రెండు సరికొత్త ఫోన్లను త్వరలో లాంఛ్ చేయనుంది. హానర్‌ 9ఏ ఫోన్లు అమేజాన్‌లో.. హానర్‌ 9ఎస్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయించనున్నారు.

వీటితో పాటు హానర్‌ మ్యాజిక్‌ బుక్‌ 15 ల్యాప్‌టాప్‌ను కూడా రిలీజ్‌ చేయనున్నారు. అలాగే బడ్జెట్ ఫోన్లు హానర్ 9ఏ, హానర్ 9ఎస్ మోడల్స్‌ను జూలై 31న భారత్‌లో ఆవిష్కరించనుంది.
 
అమేజాన్‌లో హానర్‌ 9ఏ ఫోన్‌ టీజర్‌ పేజీ ఉంది. ఆగస్టు 6న ప్రారంభం కానున్న అమేజాన్‌ ప్రైమ్‌ డే సేల్ సమయంలో హానర్‌ 9ఏ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచే ఛాన్స్‌ ఉంది. రెండు ఫోన్లు ఇప్పటికే లాంచ్‌ అయినప్పటికీ ధరల వివరాలు తెలియాల్సి ఉంది.