శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 జులై 2017 (16:56 IST)

జియో 4జీ ఫోన్‌‍ను ఎలా బుక్ చేసుకోవాలంటే...

రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ జియో ఉచితంగా 4జి ఫీచర్ ఫోన్‌ను అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఫోన్‌లో ఫ్రీ నెట్, ఫ్రీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను తాజాగా ఆవిష్కరించారు కూడా.

రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ జియో ఉచితంగా 4జి ఫీచర్ ఫోన్‌ను అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఫోన్‌లో ఫ్రీ నెట్, ఫ్రీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను తాజాగా ఆవిష్కరించారు కూడా. 
 
అయితే, రూ.1500 డిపాజిట్ చేయాలని.. మూడేళ్ల తర్వాత అవి వినియోగదారుడికే చెల్లిస్తామని ముఖేష్ అంబానీ చెప్పారు. ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు అందరికీ తెలిసినా.. ఎలా కొనాలో.. ఎలా బుక్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. దానికి సంబంధించిన వివరాలను కూడా జియో ఇపుడు వెల్లడించింది. 
 
ఆగస్టు 24వ తేదీ నుంచి ప్రీబుకింగ్స్ ప్రారంభమవుతాయని... మై జియో యాప్ ద్వారా ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని యాజమాన్యం తెలిపింది. రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు వెళ్లి కూడా ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని జియో అధికారికంగా పేర్కొంది. 
 
అంతేకాదు, ఈ ఫోన్‌ను బుక్ చేసుకునేందుకు ఓ టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. జియో ఫోన్‌ను 1860-893-3333 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. మొత్తంమీద రిలయన్స్ జియో దేశీయ టెలికాం రంగంలో పెను సంచనాలకు శ్రీకారం చుట్టింది.