ఐబాల్ బెస్ట్ ఆఫర్.. రూ.13,999కే ల్యాప్‌టాప్

ఇపుడు ప్రతి ఒక్కరూ ల్యాప్‌టాప్‌లను ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి ధరలు కాస్త భారీగానే ఉన్నాయి. అయితే, మెరుగైన ఫీచర్లు ఉండే ల్యాప్‌టాప్ కావాలనుకుంటే కనీసం 30000 రూపాయలైనా ఖర్చు చేయాల్సి

iBall Laptop
pnr| Last Updated: బుధవారం, 9 మే 2018 (11:45 IST)
ఇపుడు ప్రతి ఒక్కరూ ల్యాప్‌టాప్‌లను ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి ధరలు కాస్త భారీగానే ఉన్నాయి. అయితే, మెరుగైన ఫీచర్లు ఉండే ల్యాప్‌టాప్ కావాలనుకుంటే కనీసం 30000 రూపాయలైనా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
 
కానీ తాజాగా ఐబాల్ కంపెనీ ప్రకటించిన ఆఫర్ చూస్తే మతిపోవడం ఖాయం.. ఐబాల్ కాంప్‌బుక్ మెరిట్‌ జీ9 పేరుతో విండోస్‌ 10 ల్యాప్‌టాప్‌ను తాజాగా విడుదల చేసింది. దీని కేవలం రూ.13,999లే. 1.1కేజీల అతి తేలికపాటి బరువుతో.. 2జీబీ ర్యామ్, సెల్‌రాన్‌ ఎన్‌3350 ప్రాసెసర్‌, మల్టీ ఫంక్షనల్‌ టచ్ ప్యాడ్‌, 6 గంటల బ్యాటరీ సామర్ధ్యంతో దీన్ని తయారు చేసింది. దీని ఓవర్ఆల్ ఫీచర్స్ ఒకసారి చూస్తే..
 
* 11.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
* 1366x768 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
* 2.4గిగాహెడ్జ్‌ ఇంటెల్‌ సెల్‌రాన్‌ ఎన్‌ 3350 ప్రాసెసర్‌
* 5000 ఎంఏహెచ్‌ లి-పాలిమర్ బ్యాటరీ
* 0.3 మెగాపిక్సెల్‌ వెబ్ కెమెరా
* డ్యుయల్ బ్యాండ్ వైర్‌లెస్‌ ఏసీ3165,  బ్లూటూత్ 4.0, మినీ హెచ్‌డీఎంఐ 4.1పోర్ట్,  2.0.+ 3.0 యూఎస్‌బీ పోర్ట్స్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. 
* 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
* 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఎక్స్‌టర్నల్‌ ఎస్‌ఎస్‌డీ ద్వారా ఒక టీబీ దాకా దాకా కూడా విస్తరించుకునే అవకాశం కూడా కల్పించింది. దీనిపై మరింత చదవండి :