శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 2 మే 2018 (15:07 IST)

మోడీజీ.. పేపర్ చూసి మాట్లాడే దమ్ముందా : సీఎం సిద్ధరామయ్య సవాల్

చేతిలో స్క్రిప్టు లేకుండా పావుగంట మాట్లాడగలరా? అంటూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సవాల్ విసిరారు. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిసవాల్ విసిరా

చేతిలో స్క్రిప్టు లేకుండా పావుగంట మాట్లాడగలరా? అంటూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సవాల్ విసిరారు. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిసవాల్ విసిరారు. నిజమే.. మోడీజీ... పేపర్ చూసి 15 నిమిషాలు మాట్లాడే దమ్ముందా అంటూ నిలదీశారు.
 
ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. 'మోడీజీ.. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను.. యడ్యూరప్ప ప్రభుత్వం కర్ణాటకలో చేసిన అభివృద్ధి గురించి పేపర్ చూసే 15 నిమిషాలు మాట్లాడండి' అంటూ సిద్ధరామయ్య ప్రతి సవాల్ విసిరారు. 
 
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఎవరో రాసిచ్చిన పేపరు చదవడం కాకుండా.. ఆయన ఆశువుగా పావుగంట మాట్లాడి చూపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే.