శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (11:44 IST)

ట్రూ కాలర్‌కు ప్రత్యామ్నాయంగా భారత్ కాలర్

ట్రూ కాలర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దీనికి పోటీగా ఇండియన్ కాలర్ ఐడి యాప్ వచ్చింది. అదే, Bharat Caller యాప్. కొత్తగా లాంచ్ అయిన ఈ ట్రూఐడి కాలర్ True Caller యాప్‌కి ప్రత్యామ్నాయంగా ఉండనుంది.  
 
భారత్ కాలర్ యాప్ కాలర్ ఐడీ యాప్‌లా పనిచేస్తుంది. ఇది మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండియాలో భారతీయుల చేత క్రియేట్ చేయబడిన యాప్. ఈ యాప్ ఆగష్టు 15 వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవ పండుగ రోజు ఆవిష్కరించారు. 
 
ఈ యాప్‌ను భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీ KickHead సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు బెంగళూరు ఐఐఎమ్‌కు చెందిన ప్రజ్వల్ సిన్హా మరియు సహ వ్యవస్థాపకుడు కునాల్ పస్రిచా. 
 
ట్రూకాలర్‌ను ఇండియాలో బ్యాన్ చేసిన సమయంలో దానికి ప్రత్యామ్నాయంగా సరైన యాప్‌ని రూపొందించారు. భారత్ కాలర్  ప్రైవసీ మరియు సెక్యూరిటీ విషయంలో మరింత సురక్షితమైనదని కంపెనీ తెలిపింది. 
 
ఎందుకంటే, ఈ యాప్ వినియోగదారుల కాంటాక్ట్స్, వారి కాల్ లాగ్స్‌ను దాని సర్వర్‌లో సేవ్ చేయదు. కాబట్టి, ఇది వినియోగదారుల ప్రైవసీని కాపాడుతుంది. అలాగే, కంపెనీ ప్రకారం ఈ యాప్ భారతీయులకు కూడా సురక్షితం ఎందుకంటే ఈ యాప్ సర్వర్ భారతదేశానికి వెలుపల ఉపయోగించబడదు. అందువల్ల దీనిని ఇతర యాప్‌ల కంటే భిన్నంగా సురక్షితంగా గుర్తించవచ్చు.