ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 11 మార్చి 2024 (18:15 IST)

డిజిటలైజేషన్‌ను అందిపుచ్చుకుంటున్న భారతీయ మహిళా పారిశ్రామికవేత్తలు

GoDaddy study 2024
డిజిటలైజేషన్ అనేది ఇప్పుడు అన్ని రంగాల్లో ఉంది. దాన్ని అందిపుచ్చుకున్న వారు సరైన అవకాశాలు పొందుతారు. ఈ సందర్భంగా డిజిటలైజేషన్ ఆవశ్యకతను నొక్కి చెప్పింది GoDaddy 2024 గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సర్వే. భారతదేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు డిజిటలైజేషన్ ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, ఆ దిశగా తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తే భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. 90% మంది ప్రతివాదులు తమ వ్యాపార విజయానికి డిజిటలైజేషన్ కీలకమని భావించారని, అలాగే గై97% మంది డిజిటలైజేషన్ ఇప్పటికే తమ వ్యాపారంలో పని ప్రక్రియను గమనించదగ్గ విధంగా మెరుగుపరిచిందని అంగీకరించారు.
 
అన్నింటికి మించి మరీ ముఖ్యంగా, భారతదేశంలో సర్వే ద్వారా బయటిపడిన మరిన్ని విషయాలను ఒక్కసారి గమనిస్తే, 51% మహిళా వ్యవస్థాపకులు మిలీనియల్స్. వ్యాపార ప్రపంచంలో ఈ మిలీనియల్స్... డైనమిక్- ఫార్వర్డ్-థింకింగ్ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ సర్వే మహిళా పారిశ్రామికవేత్తలలో ఆశావాద దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. దీంతో మహిళా పారిశ్రామిక వేత్తల్లో 82% మంది రాబోయే 3-5 సంవత్సరాలలో వ్యాపార వృద్ధిని ఆశిస్తున్నారు. అదనంగా, వ్యూహాత్మక వ్యాపార లక్ష్యాలలో 57% విస్తరిస్తున్న మార్కెట్ రీచ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, 47% కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను మెరుగుపరచడంపై దృష్టి సారించడం, 38% సైబర్ భద్రత, డేటా రక్షణ చర్యలను పెంచడంపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు.
 
ఇక కొత్త సాంకేతికత విషయానికి వస్తే, 88% మంది మహిళలు మార్కెటింగ్ (60%), వ్యాపార ప్రణాళిక, వ్యూహం (60%), కస్టమర్ సేవ (49%)ని గుర్తించడం ద్వారా వ్యాపార వృద్ధికి కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతలను నావిగేట్ చేయడం, పరపతి చేయడంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో AI ద్వారా తమ వ్యాపారాన్ని మరింత మెరుగుపర్చుకోవచ్చుని, భారతదేశంలో ఏఐకు ఎంతో భవిష్యత్ ఉందని భావిస్తున్నారు మహిళా పారిశ్రామికవేత్తలు.
 
ఈ సందర్భంగా GoDaddy ఇంటర్నేషనల్ మార్కెట్స్ వైస్ ప్రెసిడెంట్ సెలీనా బీబర్ మాట్లాడారు. “డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా చిన్న వ్యాపార స్కేప్‌ను పునర్నిర్మించడం కొనసాగుతుంది. తద్వారా భారతీయ మహిళల విశ్వాసం, వారి చిన్న వ్యాపారాల పట్ల సానుకూల దృక్పథంతో మేము మరింతగా ప్రేరణ పొందాము. దీనివల్ల GoDaddy ఆన్‌లైన్‌లో విజయవంతం కావడానికి సులభమైన డిజిటల్ సాధనాలు, వనరులతో చిన్న వ్యాపారాలకు మద్దతు ఇస్తుంది అని అన్నారు.