గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 22 జూన్ 2024 (22:52 IST)

అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా యోసిక్ లైఫ్ కోసం పిలుపునిచ్చిన కెడిఎం

image
ప్రముఖ లైఫ్‌స్టైల్- మొబైల్ యాక్సెసరీస్ బ్రాండ్ కెడిఎం ‘కెడిఎం యోసిక్ లైఫ్’ అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను ప్రారంభించింది, ఇది తమ దినచర్యలో యోసిక్ లైఫ్‌స్టైల్‌ని అనుసరించటానికి నవీన తరంను ప్రేరేపించడానికి రూపొందించబడింది. 'యోసిక్' అనే పదం యోగా, సంగీతంల సమ్మేళనం. ఇది డిజిటల్ యుగం యొక్క పరిమితులను, ఆధునిక జీవితం యొక్క వేగాన్ని అధిగమించడానికి వ్యక్తులను ప్రోత్సహిస్తుంది.
 
కెడిఎం తమ ప్రత్యేక శ్రేణి ఇయర్‌బడ్‌‌లైన జెన్ పాడ్‌లు, స్మార్ట్ పాడ్‌లు, ఎంపి 3 పాడ్‌ల ద్వారా ఈ శక్తిని ప్రభావితం చేస్తుంది, ఇవి యోసిక్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడ్డాయి. ఈ పరికరాలు వ్యక్తులు తమను తాము యోగా, సంగీత ప్రపంచంలో సజావుగా లీనమయ్యేలా చేస్తాయి.
 
కెడిఎం వ్యవస్థాపకుడు ఎన్ డి మాలి మాట్లాడుతూ, “కెడిఎం యొక్క యోసిక్ లైఫ్ పరిచయం ఆధునిక డిజిటల్ జీవితంలోని అస్తవ్యస్త ధోరణుల నుండి తప్పించుకోవాలనుకునే వ్యక్తులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. కెడిఎం యొక్క వినూత్న ఇయర్‌బడ్‌లు యోగా అభ్యాసాన్ని, సంగీత ఆనందాన్ని పెంపొందించే అసమానమైన శ్రవణ అనుభవాన్ని అందిస్తాయి" అని అన్నారు. 
 
కెడిఎం సహ వ్యవస్థాపకుడు బిహెచ్ సుతార్ మాట్లాడుతూ, "కెడిఎం యోసిక్ లైఫ్ సంప్రదాయం, ఆవిష్కరణల సమ్మేళనంగా నిలుస్తుంది, యోగా- సంగీతం యొక్క సమ్మేళనం ద్వారా, ఇది మానవ అనుభవాన్ని మెరుగుపరిచే, శాంతి, సమతుల్యతను, లోతైన సంబంధాన్ని ప్రోత్సహించే పరివర్తనాత్మక జీవనశైలి ఎంపికను అందిస్తుంది" అని అన్నారు.