ఇండియా కా స్మార్ట్ ఫోన్... మార్కెట్‌లోకి జియో కొత్త స్మార్ట్ ఫోన్... ధర సస్పెన్స్
అనుకున్నట్టుగానే రిలయన్స్ జియో సరికొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 'ఇండియా కా స్మార్ట్ ఫోన్' పేరుతో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. శుక్రవారం జరిగిన రిలయెన్స్ 40వ వార్
అనుకున్నట్టుగానే రిలయన్స్ జియో సరికొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 'ఇండియా కా స్మార్ట్ ఫోన్' పేరుతో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. శుక్రవారం జరిగిన రిలయెన్స్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది.
కాగా, ఈ సందర్భంగా ఆ సంస్థ అధినేత ముకేష్ అంబానీ కంటతడి పెట్టారు. ఈ 40 ఏళ్లలో రిలయెన్స్ సాధించిన ప్రగతిని చెబుతుండగా ఆయన కంటతడిపెట్టారు. అలాగే, ప్రేక్షకుల్లో ఉన్న ఆయన తల్లి కూడా విలపించారు. 1977లో వస్త్రవ్యాపారం నుంచి ఇప్పుడు ఎన్నో రంగాల్లోకి విస్తరించినట్లు అంబానీ చెప్పారు.
ప్రస్తుతం రిలయెన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు. 1977లో రూ.3 కోట్లుగా ఉన్న సంస్థ టర్నోవర్ పది వేల రెట్లు పెరిగి రూ.30 వేల కోట్లకు చేరిందని తెలిపారు. 3500 ఉన్న ఉద్యోగులు రెండున్నర లక్షలకు చేరారని చెప్పారు. ఇక వెయ్యి ఉన్న షేరు ధర రూ. 16.5 లక్షలకు చేరిందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క నిమిషానికి ఏడుగురు కష్టమర్లు జియో కుటుంబంలో చేరుతున్నట్టు తెలిపారు.