ఆధార్ లేకుంటే? ఎయిర్‌టెల్, ఐడియా సిమ్‌లు ఇక పనిచేయవండోయ్!
భారత్‌లోని టెలికాం వినియోగదారులు త్వరలో ఆధార్ నెంబర్లను సమర్పించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. వివిధ టెలికాం సంస్థలకు చెందిన సిమ్ కార్డులను ఉపయోగించే కస్టమర్లు తమ ఆధార్ నెంబర్లను రిజిస్టర్ చేసుకోవాల్స
భారత్‌లోని టెలికాం వినియోగదారులు త్వరలో ఆధార్ నెంబర్లను సమర్పించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. వివిధ టెలికాం సంస్థలకు చెందిన సిమ్ కార్డులను ఉపయోగించే కస్టమర్లు తమ ఆధార్ నెంబర్లను రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పనులను నెలలోపు ప్రారంభించాలని టెలికాం సంస్థలకు సుప్రీం ఆదేశాలిచ్చింది.
సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎయిర్ టెల్, ఐడియా సంస్థలు తమ వినియోగదారులకు ఆధార్ నెంబర్లను సమర్పించాల్సిందిగా మెసేజ్‌లు పంపిస్తున్నాయి. అలాగే ఐడియా, ఎయిర్‌టెల్ స్టోర్లలో ప్రకటనా బోర్డులు వెలశాయి. ఈ మేరకు 2018 ఫిబ్రవరి ఆరో తేదీ లోపు వినియోగదారుల నుంచి ఆధార్ కార్డు వివరాలను సేకరించాలని టెలికాం రంగం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.