జియో కస్టమరా? ఇకపై వాట్సప్‌ నుంచే రీఛార్జ్ చేయొచ్చు..

Jio
సెల్వి| Last Updated: గురువారం, 10 జూన్ 2021 (22:57 IST)
Jio
రిలయన్స్ జియో కస్టమర్ మీరైతే.. ఇది మీకు గుడ్ న్యూసే. ఇకపై వాట్సప్‌లోనే మీ సిమ్ రీఛార్జ్ చేయొచ్చు. జియో సిమ్ మాత్రమే కాదు కుటుంసభ్యులకు, స్నేహితుల నెంబర్లకు కూడా వాట్సప్ నుంచే రీఛార్జ్ చేయొచ్చు. రిలయెన్స్ జియో కొత్తగా 'రీఛార్జ్ వయా వాట్సప్' సర్వీస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రీఛార్జ్ కోసం వేరే యాప్స్ ఉపయోగించకుండా వాట్సప్ ద్వారా చేయొచ్చు.

ఇందుకోసం మీరు రిలయెన్స్ జియో వాట్సప్ నెంబర్ సేవ్ చేసుకుంటే చాలు. వాట్సప్ ద్వారా పలు సేవల్ని అందించేందుకు జియో 70007 70007 నెంబర్‌ను కేటాయించింది. యూజర్లు ఈ నెంబర్ ద్వారా జియో సేవల్ని పొందొచ్చు.

రీఛార్జ్ మాత్రమే కాదు కొత్త జియో సిమ్, జియోకు పోర్ట్ కావడం, జియో సిమ్ సపోర్ట్, జియో ఫైబర్ సపోర్ట్, ఇంటర్నేషనల్ రోమింగ్ సపోర్ట్, జియో మార్ట్ సపోర్ట్ సేవలు జియో వాట్సప్ నెంబర్ ద్వారా లభిస్తాయి. అంతే కాదు మీకు దగ్గర్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ ఎక్కడ అందుబాటులో ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి సేవలన్నింటినీ వాట్సప్ ద్వారా అందించేందుకు జియో ఈ సర్వీస్ ప్రారంభించింది.దీనిపై మరింత చదవండి :