మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (13:47 IST)

రిలయన్స్ జియోను ఎవ్వరూ తొలి సిమ్‌గా ఉపయోగించట్లేదు..

రిలయన్స్ జియో వినియోగదారుల్లో కేవలం 18 శాతం మందే సిమ్‌ను తొలి సిమ్‌గా ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ జియో సిమ్‌ను 82 శాతం మంది రెండో సిమ్‌గా ఉపయోగిస్తున్నట్లు బెంగళూరుకు చెందిన మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ వ

రిలయన్స్ జియో వినియోగదారుల్లో కేవలం 18 శాతం మందే సిమ్‌ను తొలి సిమ్‌గా ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ జియో సిమ్‌ను 82 శాతం మంది రెండో సిమ్‌గా ఉపయోగిస్తున్నట్లు బెంగళూరుకు చెందిన మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ వెలోసిటీ ఎంఆర్ పేర్కొంది. 86 శాతం మంది ఖాతాదారులు జియోను కొనసాగించడానికి కారణం ఉచిత ఆఫరేనని వెలోసిటీ వెల్లడించింది. 
 
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో 2 వేల మందిపై వెలోసిటీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జియోను ఎవ్వరూ తొలి సిమ్‌గా ఉపయోగించట్లేదని ఆ సంస్థ తెలిపింది. కానీ కాల్ డ్రాప్స్ విషయంలో జియో 54 శాతం కాల్ డ్రాప్స్‌ను నమోదు చేసుకుంది. తద్వారా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంటే మెరుగైన స్థానంలో జియో నిలిచింది.
 
ఇదిలా ఉంటే.. 90 శాతం రిలయన్స్ జియో యూజర్లు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌లో ఉన్నారని.. 76 శాతం మంది జియో సర్వీసు ముగిసేంతవరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. 84మంది జియో యూజర్లు రూ.303, రూ.309 ప్యాక్‌లను ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది.