ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్‌.. ధర తగ్గింపు.. ఎంతో తెలుసా?

Oppo A12
సెల్వి| Last Updated: సోమవారం, 18 జనవరి 2021 (20:43 IST)
Oppo A12
ఇండియాలో ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధరను సంస్థ ఇప్పుడు తగ్గించింది. ఒప్పో F17, ఒప్పో A15, ఒప్పో రెనో 3 ప్రోల ధరలు తగ్గిన కొన్ని రోజుల తరువాత చివరిగా ఒప్పో A12 ఫోన్ యొక్క ధరలు కూడా తగ్గింపును అందుకున్నాయి. డ్యూయల్ రియర్ కెమెరా, వాటర్‌డ్రాప్ డిస్ప్లే నాచ్‌ వంటి ఫీచర్లతో ఎంట్రీ లెవల్ ప్రైస్ ఆఫర్‌లో భాగంగా జూన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేశారు.

ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరల వివరాలు
భారతదేశంలో రూ.8,990 ధర వద్ద విడుదలైన ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ను ఇప్పుడు రూ.8,ధరకు తగ్గించారు. అలాగే 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధరను ఇప్పుడు రూ.11,490 నుండి రూ. 10,990 తగ్గించారు. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో సహా అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ మార్కెట్లలో ఈ కొత్త ధరల వద్ద వీటిని పొందవచ్చు.దీనిపై మరింత చదవండి :