శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జులై 2024 (19:49 IST)

Oppo Reno 12 5G Series- భారత్‌లో జూలై 12న రిలీజ్.. ఆ వివరాలు లీక్

Oppo Reno 12 5G Series
Oppo Reno 12 5G Series
ఒప్పో రెనో 12 5జీ సిరీస్ భారత్‌లో వచ్చే వారంలో విడుదల కావచ్చు. తేదీని ఇంకా అధికారికంగా చైనీస్ టెక్ బ్రాండ్ ధృవీకరించలేదు. అయితే Oppo Reno 12 5G, Oppo Reno 12 Pro 5G.. RAM- స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో పాటు లాంచ్ తేదీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 
 
MediaTek Dimensity 7300-Energy SoCలతో కూడిన కొత్త Reno హ్యాండ్‌సెట్‌లు ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా తమ అరంగేట్రం చేశాయి. అవి ట్రిపుల్ రియర్ కెమెరాలు, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు, 5,000mAh బ్యాటరీలను కలిగి ఉంటాయి.
 
Oppo Reno 12 5G సిరీస్ ఇండియా లాంచ్ తేదీ
Oppo Reno 12 5G సిరీస్ జూలై 12న భారత మార్కెట్లోకి వస్తుందని టెక్ అవుట్ లుక్ తెలిపింది. Oppo Reno 12 5G 8GB RAM + 256GB నిల్వ ఎంపికలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే Oppo Reno 12 Pro 5G 12GBలో అందించబడుతుంది. 
 
RAM + 256GB, 12GB RAM + 512GB స్టోరేజీల్లో వుంటాయి.
వీటి ధర రూ. 53,700లకి అందుబాటులో ఉంది.