గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (17:26 IST)

సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది.. గూగుల్‌లో జాబ్ పట్టేసింది..

ప్రస్తుతం డాక్టర్ చదువు అభ్యసించి యాక్టర్‌లు అవుతున్న వారిని చూస్తున్నాం. మరి యాక్టర్‌గా ఉంటూ, తాను నటించిన సినిమాలకు అవార్డులు వచ్చి, సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ మయూరీ కాంగో మాత్రం సినిమాలకు గుడై‌బై చెప్పి గూగుల్ కంపెనీలో చేరింది. 1995 సంవత్సరంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మయూరీ తాను నటించిన తొలి చిత్రం నసీంతోనే జాతీయ అవార్డు గెలుచుకుంది.
 
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న ఈ బ్యూటీ సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్‌తో క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం వచ్చినా కాదనుకుంది. నటిగా అజయ్ దేవగన్, అనుపమ్ ఖేర్, అర్షద్ వార్సీ, శక్తికపూర్, బాబీ డియోల్, రాణీ ముఖర్జి, చంద్ర చూడ్ సింగ్, జుగల్ హన్సరాజ్‌‌తో కలిసి నటించారు. ఆ తర్వాత ఆఫర్‌లు మొహం చాటేయడంతో వెండితెర నుండి బుల్లితెరకు వచ్చేసింది.
 
కహీ కిసీ రోజ్, కిట్టి పార్టీ, కుసుమ్, క్యా హద్సా క్యా హకీకత్ అనే సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత ఆదిత్య దిల్లాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఒక బాబు పుట్టిన తర్వాత బుల్లితెరకు కూడా దూరమై మళ్లీ చదువుపై దృష్టి సారించింది. న్యూయార్క్‌లోని జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేసింది. న్యూయార్క్ డిజిటల్ ఏజెన్సీలో కొన్ని రోజులు పనిచేసింది.
 
ఆ తర్వాత డిజిటాస్, జెనిత్‌లో ఛీప్ డిజిటల్ ఆఫీసర్‌గా పని చేసింది. అనంతరం ఇండియాకు వచ్చి గుర్‌గావ్‌లో ఉంటూనే గూగుల్‌లో ఉద్యోగానికి ప్రయత్నించింది. గూగుల్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా సెలక్ట్ అయ్యింది. ఉద్యోగంలో భాగంగా ముంబై, బెంగళూరు నగరాల మధ్య తిరగాల్సి వస్తోందని, అలాగే మంచి స్క్రిప్ట్‌ వస్తే నటిగా మళ్లీ తెరపై కనిపిస్తానని అంటోంది.