శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:13 IST)

రూ.24,490 కే పానాసోనిక్ ఇన్వ‌ర్ట‌ర్ ఏసీ..!

ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ పానాసోనిక్‌కు చెందిన సబ్‌బ్రాండ్ సాన్‌యో ఈరోజు భారత మార్కెట్‌లోకి నూతన ఇన్వెర్టర్ ఏసీలను విడుదల చేసింది. ఈ ఏసీలు రూ.24,490 ప్రారంభ ధ‌ర‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏసీలు మొత్తం 5 ర‌కాల మోడ‌ల్స్‌లో విడుదల కాగా వీటిల్లో 3 స్టార్‌, 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు ఉన్నాయి.
 
అలాగే ఈ ఏసీలు 1, 1.5, 2 ట‌న్ కెపాసిటీతో ల‌భిస్తున్నాయి. వీటిని అమెజాన్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. వీటిలో గ్లేసియర్ మోడ్ అనే ఫీచర్ ఉండడం వల్ల ఫ్యాన్ 35 శాతం అధిక స్పీడ్‌తో తిరుగుతుంది. అంతేకాకుండా అత్యంత తక్కువ సమయంలోనే గది కూలింగ్ అవుతుంది.

వీటిల్లో ఉన్న ఎకో ఫంక్షన్ అనే ఫీచర్ తక్కువ విద్యుత్తును వాడేలా చేస్తాయి, ఫలితంగా విద్యుత్తు వాడకం కూడా బాగా తగ్గుతుంది మరియు కరెంటు బిల్లును ఆదా చేస్తుంది.