సోమవారం, 27 మార్చి 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 17 మార్చి 2023 (10:58 IST)

పోకో నుంచి 5జీ ఫోన్.. మార్చి 21 నుంచి సేల్ ప్రారంభం

Poco X5 5G
Poco X5 5G
పోకో నుంచి 5జీ ఫోన్ హవా కొనసాగుతోంది. దేశంలో 5జీ సేవలు విస్తృతంగా విస్తరిస్తున్న తరుణంలో తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ను 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ల‌లో తీసుకొచ్చారు. ఇక ఇందులో 6.67 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. మార్చి 21వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది.  
 
ఈ ఫోన్ ఫీచర్స్ సంగతికి వెళ్తే.. 
క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌
120 హెచ్‌జెడ్‌ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే 
48 ఎంపీ ట్రిపుల్ రియ‌ర్ కెమెరా
33 డ‌బ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ స‌పోర్ట్‌తో భారీ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం
ధర వివరాలు: 128 జీబీ ధర రూ. 18999, 256 జీబీ ధర విషయానికొస్తే రూ. 20,999గా ఉంది.