'రియల్ మి' సిరీస్ ఫోన్ ధరలను పెంచిన ఒప్పో

realme c1 phone
Last Updated: బుధవారం, 7 నవంబరు 2018 (16:29 IST)
మొబైల్ తయారీ కంపెనీల్లో ఒకటైన ఒప్పో... తన రియల్ మీ సబ్ బ్రాండ్ కింద ప్రవేశపెట్టిన ఫోన్ల ధరలను ఒక్కసారిగా పెంచింది. ఈ ఫోన్లకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని వీటి ధరలను పెంచింది.

రియల్ మి సబ్ బ్రాండ్ కింద ఇప్పటివరకు రియల్ మి1, రియల్ మి సి1, రియల్ మి2, రియల్ మి2 ప్రొ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లకు మంచి ఆదరణ లభించింది. దీంతో రియల్ మి 2, రియల్ మి సి1 ఫోన్ల ధరలను పెంచినట్లు ఒప్పో ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

ఈ ప్రకటన మేరకు రియల్ మి 2కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,990 ఉండగా, పెరిగిన ధర తర్వాత ఇప్పుడీ ఫోన్ రూ.9,499కు చేరుకుంది. అలాగే, ఇదే ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,990 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. ఇక రియల్ మి సి1 ఫోన్ ధర రూ.6,999 ఉండగా, దీని ధరను రూ.వెయ్యి పెంచి రూ.7,999కు విక్రయిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :