రియల్ మీ నుంచి మరో కొత్త ఫోన్.. ఫీచర్స్ ఇవే
రియల్ మీ నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది. సీ-సిరీస్‌లో సీ 55 మోడల్‌ను మార్కెట్లోకి దించుతోంది. ఆండ్రాయిడ్ 13తో వస్తున్న ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 64 మెగాపిక్సెల్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఆకర్షించే డిజైన్‌తో రూపొందించింది.
6జీబీ-128 జీబీ మోడల్ ధర ఇండోనేషియాలో సుమారు రూ.13,300 కాగా, 8జీబీ-256 జీబీ వేరియంట్ ధర రూ.16 వేలు. రెయినీ నైట్, సన్ షవర్ అనే రెండు కలర్ లలో సీ55 ఫోన్ వస్తోంది. త్వరలోనే భారతదేశంలోనూ ఈ ఫోన్ సేల్స్ ప్రారంభించేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది.
సీ 55 మోడల్ ఫీచర్స్
టెక్ హీలియో జీ88 ప్రాసెసర్
వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి.
64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,
2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా.