రియల్ మీ యూజర్లకు గుడ్ న్యూస్.. అదేంటంటే..?
రియల్ మీ యూజర్లకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా అతి త్వరలోనే 300 నుంచి 500 రియల్‌మి స్మార్ట్ స్టోర్స్‌తోపాటు ప్రీమియం సర్వీస్ సెంటర్లు, ఫ్లాగ్‌షిప్ స్టోర్స్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు రియల్ మి తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌లో 2020 సంవత్సరానికి గాను రియల్‌మి టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది.
అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో ఆ కంపెనీ ఆ మార్కెట్‌లో 27 శాతం వృద్ధిని సాధించింది. ఈ క్రమంలోనే దేశంలోని యూజర్లకు, అందులోనూ ఆఫ్‌లైన్ మాధ్యమంలో మరింత చేరువ అయ్యేందుకు ఆ స్టోర్స్ ను ఓపెన్ చేస్తున్నట్లు తెలిపింది.
ఇక త్వరలో గుజరాత్‌లో రియల్‌మికి చెందిన మొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం కానుంది. మొత్తం 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ స్టోర్‌ను ఏర్పాటు చేస్తారు. అందులో రియల్‌మికి చెందిన టీవీలు, ఆడియో ఉత్పత్తులు, వియరబుల్స్, ఫోన్లు తదితర అన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు.
వినియోగదారులు రియల్‌మి స్టోర్స్‌లో ఉండే ఉత్పత్తులను అనుభూతి చెందవచ్చు. వాటిని కొనుగోలు చేయవచ్చు. అలాగే ప్రీమియం సర్వీస్ సెంటర్ల ద్వారా కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందుతాయని సంస్థ ఏ ప్రకటనలో తెలిపింది.