శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 మే 2021 (11:53 IST)

రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌... మార్కెట్లోకి 4 స్మార్ట్ ఫోన్లు.. ప్రారంభ ధర రూ.11వేలే

Redmi Note 10 5G series
రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో ఇప్పటివరకు మొత్తం 4 స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను మార్చిలో రిలీజ్ చేసింది షావోమీ. రెడ్‌మీ నోట్ 10ఎస్ మోడల్‌ను ఇటీవల పరిచయం చేసింది. దీంతో రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నాయి.
 
 రూ.12,000 లోపు, రూ.15,000 లోపు, రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్లు కోరుకునే యూజర్లను కవర్ చేసేలా రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో ఈ 4 మోడల్స్ రిలీజ్ చేసింది షావోమీ. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభం అవుతుంది. బ్యాంక్ ఆఫర్లతో కొంటే 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు.