సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (09:25 IST)

హైదరాబాద్‌ జియో ఇన్ఫోకామ్‌లో ఉద్యోగాలు.. జాబ్ మేళా ఎపుడంటే?

హైదరాబాద్ నగరంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌ ఉద్యోగ మేళాను నిర్వహించనుంది. మొత్తం 300 అసిస్టెంట్ టెక్నీషియన్ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఇందుకోస సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ప్రాంతీయ సంచాలకుడు వెంకటేశ్వరరావు వెల్లడించారు. 
 
హైదరాబాద్ నగరంలోని రామాంతపూర్‌లోని జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలో ఈ జాబ్ మేళా జరుగుతుందని, ఐటీఐలో ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్స్ మెకానిక్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సులు పూర్తి చేసినవారు ఈ మేళాకు హాజరు కావచ్చని తెలిపారు. తెలంగాణలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా సూచించారు.