రిలయన్స్ జియో అరుదైన ఘనత.. గ్లోబల్‌-500లో ఐదో స్థానం!

reliance jio
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 29 జనవరి 2021 (14:35 IST)
నాలుగేళ్ల క్రితం దేశంలో సేవలు ప్రారంభించి టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. ఈ సంస్థ అడుగుపెట్టిన స్వల్పవ్యవధిలోనే దేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇప్పుడు అంతర్జాతీయంగా బలమైన బ్రాండ్లలో అయిదో స్థానాన్ని ఆక్రమించింది. ఈ మేరకు ‘గ్లోబల్ 500’ జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసింది. ఇందులో చైనాకు చెందిన ‘వియ్‌చాట్’ అగ్రస్థానంలో నిలిచింది.

ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న పెరారీని వియ్‌చాట్ రెండో స్థానంలోకి నెట్టేసింది. రష్యాకు చెందిన ఎస్బర్ బ్యాంక్, కోకాకోలా మూడు నాలుగు ర్యాంకుల్లో నిలిచాయి. జియో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.

భారత్‌లో మొత్తం 40 కోట్ల మంది వినియోగదారులతో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్‌గా, ప్రపంచంలో మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా నిలిచిందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. ప్రతిష్ట, మౌత్ పబ్లిసిటీ, కొత్తదనం, సేవలు, డబ్బుకు తగ్గ విలువ వంటి అంశాల్లో జియో మేటిగా నిలిచిందని ప్రశంసించింది.దీనిపై మరింత చదవండి :