శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 మార్చి 2017 (12:47 IST)

రిలయన్స్ జియో షాక్ : 3 నెలల్లో ఏదో ఒక ప్యాక్‌తో రీచార్జ్ చేయకుంటే సర్వీస్‌లన్నీ బంద్

రిలయన్స్ జియో తన వినియోగదారులకు తేరుకోలేని షాక్ ఇచ్చింది. మార్చి 31వ తేదీలోపు ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం తీసుకున్న తర్వాత ప్రతి వినియోగదారుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్యాక్‌లో రీచార్జ్ చేయాల్సిందేనని లేకుంట

రిలయన్స్ జియో తన వినియోగదారులకు తేరుకోలేని షాక్ ఇచ్చింది. మార్చి 31వ తేదీలోపు ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం తీసుకున్న తర్వాత ప్రతి వినియోగదారుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్యాక్‌లో రీచార్జ్ చేయాల్సిందేనని లేకుంటే ఔట్ గోయింగ్ కాల్స్ బంద్ అవుతాయని తేల్చి చెప్పింది. 
 
రిలయన్స్ జియో తాజా ప్రకటన మేరకు ఈనెల 31వ తేదీ లోపు 99 రూపాయలు చెల్లించి జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సిందే. ఈ సభ్యత్వం తీసుకున్నాం కదా రీచార్జ్ చేయించాల్సిన పనేం లేదని భావిస్తే మాత్రం పప్పులో కాలేసినట్టేనని పేర్కొంది. 99 రూపాయలతో రీచార్జ్ చేయించింది ఏడాది పాటు అదనపు లాభాలు పొందడానికి మాత్రమేనని జియో స్పష్టమైన వివరణ ఇచ్చింది. 
 
రూ.99 రీచార్జ్‌తో పాటు... జియో ప్రైమ్ యూజర్లు కూడా ఏదో ఒక ప్యాక్‌ను రీచార్జ్ చేయించుకోవాలని జియో యాజమాన్యం అధికారిక వెబ్‌సైట్లో తెలిపింది. లేకపోతే జియో సేవలు నిలిపివేస్తామని కూడా హెచ్చరించింది. రీచార్జ్ చేయించకపోతే కాల్స్ చేయడానికి అనర్హులని తేల్చేసింది. కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ మాత్రమే వస్తాయని, ఔట్ గోయింగ్ కాల్స్ సర్వీస్ ఉండదని తెలిపింది. మూడు నెలల్లోపు ఏదో ఒక ప్యాక్‌తో రీచార్జ్ చేయించకపోతే సర్వీస్ పూర్తిగా నిలిపివేస్తామని కూడా జియో స్పష్టం చేసింది.