రిలయన్స్ జియో కొత్త డాంగిల్ కొన్నారా? రూ.1005లకే జియో-ఫై

రిలయన్స్ జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో కొత్త డాంగిల్ అంటే కొత్త ఆఫర్ కింద రూ.1999 చెల్లించిన డాంగిల్ కొనుగోలు చేసిన వినియోగదారులు రూ.2010 విలువ చేసే 4జీ డేటాను 84 రోజుల పాటు ఉచి

Selvi| Last Updated: మంగళవారం, 9 మే 2017 (16:10 IST)
రిలయన్స్ జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో కొత్త డాంగిల్ అంటే కొత్త ఆఫర్ కింద రూ.1999 చెల్లించి డాంగిల్ కొనుగోలు చేసిన వినియోగదారులు రూ.2010 విలువ చేసే 4జీ డేటాను 84 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు.

ఎక్స్ఛేంజ్ ఆఫర్లో జియో డాంగిల్‌ను కొనుగోలు చేయని వారికి రూ. 1005 విలువ చేసే 4జీ డేటా అందుతుంది. జియో కొత్త డాంగిల్ ధర. రూ. 1999 కాగా.. ఇప్పటికే ఇంటర్నెట్‌ డాంగిల్‌ వినియోగిస్తున్న వారు కొత్త దాని కోసం రూ.999 చెల్లించి ఎక్స్ఛేంజ్‌ చేసుకోవచ్చు.

పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌ యూజర్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని జియో తెలిపింది. డామేజ్ అయిన డాంగిల్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం కుదరదు. రూ. 2,010 చెల్లించి డాంగిల్ కొనేవారికి 100 శాతం క్యాష్ బ్యాక్ సదుపాయం వుంటుందని.. బూస్టర్ కోసం రూ.201 చెల్లించాల్సి వుంటుందని జియో తెలిపింది. క్యాష్ బ్యాక్ కోసం జియో స్టోర్లు, ఆన్‌లైన్‌ ద్వారా జియో వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చు.దీనిపై మరింత చదవండి :