శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (12:11 IST)

వావ్.. ఐస్ బ్లూ కలర్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్9.. అదిరిందిగా..

శాంసంగ్ నుంచి కొత్త ఫోన్‌ కలర్ వేరియంట్లలో మార్కెట్లో విడుదలైంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ తాజాగా మరో కలర్ వేరియంట్లో వినియోగదారులకి అందుబాటులోకి వుంచనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నెల 20 నుండి ఎస్9, అలాగే 26వ తేదీ నుండి ఎస్9 ప్లస్ మోడళ్లు ఐస్ బ్లూ కలర్ వేరియంట్లో లభ్యం కానున్నాయి.
 
గతంలో విడుదలైన మిడ్‌ నైట్ బ్లాక్, టైటానియం గ్రే, కోరల్ బ్లూ, లైలాక్ పర్పుల్, సన్‌ రైజ్ గోల్డ్, బర్గండీ రెడ్ కలర్ వేరియెంట్లతో పాటు తాజాగా ఐస్ బ్లూ కలర్ వేరియంట్లో కూడా లభించనుందని సంస్థ ఏ ప్రకటనలో తెలిపింది.
 
శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఫీచర్స్.. 
శాంసంగ్ గెలాక్సీ ఎస్9 5.8 ఇంచ్‌ల క్యూహెచ్డీ ప్లస్ కర్వ్డ్ సూపర్ ఏఎమ్ఓఎల్ఈడీ ప్యానెల్ కలిగివుంది. 
శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ప్లస్ కూడా 6.2 ఇంచ్‌ల క్యూహెచ్డీ ప్లస్ కర్వ్డ్ సూపర్ ఏఎమ్ఓఎల్ఈడీ ప్యానెల్ కలిగివుంది.
ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఫోన్ ధర సుమారుగా రూ. 57,000 ఉండగా, గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్ ధర సుమారుగా రూ. 67,400గా ఉండనుంది.